Israel: ఇజ్రాయిల్ హైఫా యుద్ధంలో మరణించిన భారతీయ సైనికులకు అక్కడి ప్రజలు నివాళులు అర్పించారు. హైఫా నగరాన్ని ఒట్టోమన్ పాలన నుంచి విముక్తి చేసింది బ్రిటీష్ సైనికులు కాదని, భారతీయ సైనికులే అని హైఫా మేయర్ అన్నారు. దీని ఆధారంగా పాఠశాల చరిత్ర పుస్తకాలను మారుస్తానని మేయర్ యోనా యాహవ్ అన్నారు. భారతీయ సైనికుల్ని ఖననం చేసిన స్మశానంలో వారి ధైర్యసాహసాలకు నివాళులు అర్పించే కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Turkey Earthquake: టర్కీ దేశం భూకంపం వల్ల తీవ్రంగా దెబ్బతింది. టర్కీలోని దక్షిణ ప్రాంతం తీవ్రంగా నష్టపోయింది. 7.8, 7.5 తీవ్రతతో వచ్చిన భూకంపాల ధాటికి పెద్ద ఎత్తున భవనాలు, ఇళ్లు కూలిపోయాయి. టర్కీతో పాటు సిరియా కూడా దెబ్బతింది. ఇప్పటికే ఈ రెండు దేశాల్లో మరణాల సంఖ్య 24 వేలను దాటింది. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. తీవ్రంగా నష్టపోయిన టర్కీకి ప్రపంచదేశాల నుంచి ఆపన్నహస్తం అందుతోంది. భారత్ ‘ఆపరేషన్ దోస్త్’ పేరుతో…