2025 మహిళల ప్రపంచకప్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించిన భారత్ ఫైనల్‌కు అర్హత సాధించింది. 339 పరుగులను భారత్ మరో 9 బంతులుండగానే ఐదు వికెట్స్ కోల్పోయి ఛేదించింది. జెమీమా అజేయ సెంచరీ (127) చేయగా.. హర్మన్‌ప్రీత్ కౌర్ (89) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడింది. ఆదివారం జరిగే ఫైనల్లో దక్షిణాఫ్రికాతో టీమిండియా తలపడనుంది. ఈసారి కొత్త ఛాంపియన్ అవతరించనుంది. ఇప్పటివరకు దక్షిణాఫ్రికా, భారత్ జట్లు వన్డే ప్రపంచకప్ గెలవలేదు. ఈ రెండు టీమ్స్ ఫైనల్‌లో చోటు దక్కించుకోవడమే కాకుండా..…