ప్రజల్లో చైతన్యం పెంచడానికి వరల్డ్ డోనర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. రక్తదాన కార్యక్రమాల్లో నలుగురు ఎమ్మెల్యేలు యాక్టివ్‌గా ఉన్నారన్న మంత్రి హరీష్ రావు.. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి 18 సంవత్సరాల నుంచి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారన్నారు. 1000 యూనిట్స్ తక్కువ కాకుండా అందించారని, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఎన్నో యూనిట్స్ బ్లడ్ అందించారన్నారు. అంతేకాకుండా ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి 7100 యూనిట్స్ రక్తాన్ని అందించారని,…