ముంబై వేదికగా ఇంగ్లండ్ మహిళల జట్టుతో జరుగుతున్న ఏకైక టెస్ట్‌లో టీమిండియా మహిళా టీమ్ పట్టు బిగుస్తుంది. భారత అమ్మాయిలు తలో చేయి వేయడంతో తొలి ఇన్నింగ్స్‌లో 428 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ బ్యాటర్లు 138 పరుగులకే ఆలౌట్ చేసి 292 రన్స్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం టీమిండియా పొందింది.