ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా నేడు భారత్, శ్రీలంక మహిళా జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. తిరువనంతపురంలో రాత్రి 7 నుంచి మూడో టీ20 ఆరంభం కానుంది. వరుసగా రెండు టీ20ల్లో గెలిచిన భారత్.. మూడో మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను పట్టేయాలనే పట్టుదలతో ఉంది. సూపర్ ఫామ్‌లో ఉన్న టీమిండియాను ఎదుర్కోవడం శ్రీలంకకు సవాలే అని చెప్పాలి. విశాఖలో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన లంక.. మూడో మ్యాచ్‌లో ఏ మేరకు పోటీని ఇస్తుందో…