పురుషుల ఐపీఎల్ తరహాలోనే బీసీసీఐ మహిళా క్రికెటర్లకు కూడా ఐపీఎల్‌ను నిర్వహిస్తోంది. అయితే మహిళల ఐపీఎల్ కేవలం మూడు జట్లు మాత్రమే పాల్గొంటున్నాయి. ఈ మేరకు తాజాగా బీసీసీఐ నాలుగో సీజన్ మహిళల టీ20 ఛాలెంజ్ షెడ్యూల్‌ను ప్రకటించింది. సూపర్ నోవాస్, ట్రైల్ బ్లేజర్స్, వెలాసిటీ జట్ల మధ్య ఈ టోర్నీ జరగనుంది. మే 23న ప్రారంభం కానున్న ఈ టోర్నీలో మొదటి మ్యాచ్ మూడో సీజన్ ఫైనలిస్టులు ట్రైల్‌బ్లేజర్స్ వర్సెస్ సూపర్ నోవాస్ మధ్య జరగనుంది.…