టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ ఇటీవల మహిళల డ్రెస్సింగ్ స్టైల్‌ను ఉద్దేశించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకున్నాయి. దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ల దుస్తుల గురించి ఆయన మాట్లాడిన తీరు కేవలం సోషల్ మీడియాకే పరిమితం కాకుండా, తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ దృష్టికి చేరింది. ఈ విషయాన్ని కమిషన్ అత్యంత తీవ్రంగా పరిగణించింది. నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద స్పందించారు. శివాజీ…