భారత ఓపెనర్ స్మృతి మంధాన ఐసిసి మహిళల వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచింది. ప్రస్తుతం జరుగుతున్న మహిళల క్రికెట్ వన్డే కప్‌లో పలువురు టాప్ ప్లేయర్స్ రాణించినప్పటికీ వారిని వెనక్కి నెట్టి ఫస్ట్ ప్లేస్ కైవసం చేసుకుంది. వన్డే వరల్డ్ కప్ ముందు రెండు శతకాలతో మెరిసిన టీమిండియా వైస్ కెప్టెన్ 791 రేటింగ్ పాయింట్లతో నంబర్ 1 ర్యాంక్‌లో కొనసాగుతోంది. మంధాన స్పష్టమైన ఆధిక్యాన్ని కొనసాగిస్తుండగా, దక్షిణాఫ్రికాకు చెందిన టాజ్మిన్ బ్రిట్స్ తన అద్భుతమైన…