వచ్చే ఏడాది దేశంలోని అనేక రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో గోవా కూడా ఒకటి. ఎలాగైనా గోవాలో అధికారం అధికారంలోకి రావాలని కాంగ్రెస్, ఆప్, తృణమూల్ కాంగ్రెస్‌లు చూస్తున్నాయి. ఆయా పార్టీల నేతలు ఇప్పటి నుంచే ప్రచారం మొదలుపెట్టి హమీలు గుప్పిస్తున్నారు. నిన్నటి రోజున కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక గాంధీ గోవాలో పర్యటించి మహిళలను ఆకట్టుకునే విధంగా హామీలు ఇచ్చారు. 24 గంటలు గడవక ముందే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మహిళలకు భారీ వరాలు ప్రకటించింది.…