హైదరాబాద్ నగరంలో పేకాట రాయుళ్లు రెచ్చిపోతున్నారు. లోధా అపార్ట్మెంట్స్ లో పేకాట ఆడుతున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో 13 మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు పట్టుబడ్డారు. పక్కా సమాచారంతో మాదాపూర్ డీసీపీ ఆధ్వర్యంలో పోలీసులు రైడ్ చేశారు. ఈ దాడిలో 13 మంది పేకాట ఆడుతుండగా వారిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. పోలీసులకు పట్టుబడిన వారంతా రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా పోలీసులు గుర్తించారు.…