మహారాష్ట్రలో పట్టపగలే దుండగులు రెచ్చిపోయారు. రద్దీగా ఉండే ప్రాంతంలో ఒక వ్యక్తిపై అగంతకులు అమాంతంగా దాడి చేశారు. అనంతరం తేరుకున్న తల్లి, కొడుకు ఎదురుదాడికి దిగడంతో అక్కడ నుంచి పరారయ్యారు. ఈ ఘటన కొల్హాపూర్‌లోని జైసింగ్‌పూర్ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.