తెలుగు చిత్రసీమలో దర్శకనిర్మాత క్రాంతికుమార్ మహిళా పక్షపాతిగా సాగారు. తాను నిర్మించిన చిత్రాలలోనూ, దర్శకత్వం వహించిన సినిమాల్లోనూ మహిళల సమస్యలకు తగిన పరిష్కారం చూపించడమే కాదు, సమాజాన్నీ ఆలోచింపచేసేవారు. అందుకే క్రాంతికుమార్ ను చాలామంది ‘వెండితెర చలం’ అంటూ కీర్తించారు. నిర్మాతగా క్రాంతికుమార్ తొలి చిత్రం ‘శారద’లోనూ, దర్శకునిగా చివరి చిత్రం ‘9 నెలలు’లోనూ మహిళా పక్షపాతిగానే నిలిచారు. తాను నిర్మించిన కమర్షియల్ మూవీస్ లోనూ మహిళల సమస్యలను అంతో ఇంతో చర్చించడానికే తపించేవారు. …