Chinese Loan Apps: హైదరాబాద్ సహా దేశంలోని 16 చోట్ల చైనా లోన్ యాప్‌లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు జరిపింది. బెంగళూరు, చెన్నై, న్యూఢిల్లీ, పుణె, గురుగ్రామ్ తదితర నగరాల్లో నిర్వహించిన సోదాల్లో 46 కోట్ల రూపాయలను సీజ్ చేసింది. హెచ్‌పీజెడ్ టోకెన్ యాప్‌లో డబ్బు పెట్టుబడి పెట్టి బిట్‌కాయిన్‌తోపాటు ఇతర క్రిప్టోకరెన్సీని కొనుగోలు చేస్తే రెట్టింపు సొమ్ము ఇస్తామంటూ కేటుగాళ్లు అమాయకులను మోసగిస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో రైడ్స్ చేశామని ఈడీ అధికారులు తెలిపారు.
Disney Follows Amazon Prime: అమేజాన్ ప్రైమ్ మాదిరిగానే డిస్నీ కస్టమర్లకి కూడా త్వరలో డిస్నీ ప్రైమ్ అందుబాటులోకి రానున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. సబ్‌స్క్రిప్షన్ సర్వీసులను ప్రారంభించేందుకు ఈ సంస్థ కసరత్తు చేస్తోంది. డిస్నీ ప్లస్ అనే స్ట్రీమింగ్ సర్వీస్‌తోపాటు డిస్నీ ప్రైమ్ కూడా ఆరంభమైతే బ్రాండెడ్ మర్చెండైజ్‌లు, థీమ్ పార్క్‌లు, ప్రొడక్ట్‌లపై డిస్కౌంట్లు ప్రకటించనుంది. అమేజాన్ ప్రైమ్‌ని స్ఫూర్తిగా తీసుకొని డిస్నీ ఎగ్జ్‌క్యూటివ్‌లు ఈ కొత్త ప్రణాళికను రచించారు.