Karnataka: కర్ణాటకలో దారుణం జరిగింది. తన భార్యకు అక్రమ సంబంధం ఉందని అనుమానించిన భర్త ఆమెను దారుణంగా చంపేశాడు. ఆ తరువాత అతను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కర్ణాటకలో చర్చనీయాంశంగా మారింది. నిందితుడు ఆ రాష్ట్ర పోలీస్ శాఖలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. భార్య మరణించగా.. నిందితుడైన భరత్ పురుగుల మందు తాగి చావుబతుకుల మధ్య ఉన్నాడు. విషాదం ఏంటంటే వీరిద్దరికి 11 రోజుల క్రితమే బాబు జన్మించాడు.