Corbevax: భారత తయారీ కోవిడ్ వ్యాక్సిన్ ‘కార్బెవాక్స్’ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అత్యవసర వినియోగ జాబితాలో చేర్చింది. కార్బెవాక్స్ టీకాను హైదరాబాద్‌కి చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ బయోలాజికల్ E లిమిటెడ్ తయారు చేసింది. దీనిపై బయోలాజికల్ E డైరెక్టర్ మహిమా దాట్ల మాట్లాడుతూ..WHO ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్ (EUL) పట్ల మేము సంతోషంగా ఉన్నామని, ఈ నిర్ణయం కోవిడ్-19కి వ్యతిరేకంగా మా ప్రపంచ పోరాటాన్ని బలపరుస్తుందని అన్నారు.