Wheat Price : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా గోధుమల సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ పరిస్థితిలో, గోధుమ ఉత్పత్తిలో రెండవ స్థానంలో ఉన్న భారతదేశం వైపు ప్రపంచం దృష్టి పడింది.
కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియా నుంచి గోధుమల ఎగుమతులను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. దేశీయంగా పెరుగుతున్న ధరలను నియంత్రించేందుకు కేంద్ర ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిసింది. మే 14 నుంచి గోధుమల ఎగుమతులను తక్షణమే నిలపివేయాలని వాణిజ్య మంత్రిత్వ శాఖ తన ఉత్తర్వుల్లో తెలిపింది. అయితే ఈ ఉత్తర్వుల కన్నా ముందు ఎగుమతుల కోసం అనుమతులు ఉంటే అనుమతించబడుతాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ( డిజిఎఫ్టీ) శుక్రవారం విడుదల చేసిన నోటిఫికేషన్ లో…