వాట్సాప్ సేవలు ఈ మధ్యే ఏకంగా దాదాపు 2 గంటల పాటు ఆగిపోయాయి.. యూజర్లు మాత్రం అల్లాడిపోయారు.. దీనిపై ఇతర సోషల్ మీడియా యాప్స్‌లో తమ గోడును వెల్లబోసుకున్నారు.. ముఖ్యంగా ట్విట్టర్‌లో తన ఆవేదన వ్యక్తం చేశారు.. సెటైర్లు కూడా వేశారు.. మరోవైపు కొత్త కొత్త ఫీచర్లను తమ యూజర్ల కోసం అందుబాటులోకి తీసుకొస్తూనే ఉంది ఈ పాపులర్ మెసేజింగ్ యాప్… తన యూజర్లు ఏ మాత్రం చేజారకుండా.. మరికొంతమందిని ఆకట్టుకునేలా కొత్త ఫీచర్లతో అదరగొడుతూనే ఉంది..…
WhatsApp: ఎప్పటికప్పుడు తన యూజర్లకు కొత్త కొత్త ఫీచర్లు అందుబాటులోకి తీసుకొస్తున్న వాట్సాప్.. ఇప్పుడు మరో కొత్త అదిరిపోయే ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తోంది.. ఇప్పటి వరకు వాట్సాప్‌లో ఏదైనా మెసేజ్ పెడితే.. దానిని మార్చాలంటే ఎట్టి పరిస్థితుల్లో కుదరదు.. పాతది డెలిట్ చేసి.. మార్పులు చేస్తూ.. మరో కొత్త మెసేజ్ పెట్టుకోవాల్సిన పరిస్థితి.. అయితే.. ఆ కష్టాలకు చెక్ పెడుతూ.. త్వరలో ఓ నయా ఫీచర్‌ను అందుబాటులోకి తేనున్నట్లు తెలిపింది వాట్సాప్… ‘ఎడిట్ మెసేజ్స్’ ఫీచర్ పేరుతో…
‘వాట్సాప్’ దాదాపు ఈ సోషల్ మీడియా యాప్ తెలియనివారు ఉండరు అంటే ఆశ్చర్య పోవాల్సిన అవసరమే లేదు.. అంతలా అందరి జీవితాల్లో ఇది భాగమైపోయింది.. చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉందంటే.. దాంట్లో వాట్సాప్ ఉండాల్సిందే.. టెస్ట్, వీడియోలు, ఫైల్స్, లింక్‌లు, ఫొటోలు.. వాయిస్ కాల్స్, వీడియో కాల్స్.. ఇలా అనేక ఫీచర్లు అందుబాటులో ఉండడంతో.. తక్కువ కాలంలోనే అందరి అభిమానాన్ని చురగొంది. ఇక, వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా.. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్‌ను పరిచయం చేస్తూనే ఉన్నారు నిర్వహకులు.. వినియోగదారు…