హైదరాబాద్‌కు చెందిన ఈక్వల్ AI కంపెనీ భారతదేశంలో మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత కాలర్ అసిస్టెంట్‌ను ప్రారంభించబోతోంది. ఈ యాప్ అక్టోబర్ 2 నుండి అందుబాటులోకి వస్తుంది. ఢిల్లీ NCRలో మొదటి 10,000 మంది ఆండ్రాయిడ్ వినియోగదారులకు ముందస్తు యాక్సెస్ ప్రోగ్రామ్ ఉంటుంది. మార్చి 2026 నాటికి ప్రతిరోజూ 1 మిలియన్ వినియోగదారులను చేరుకోవడమే లక్ష్యం అని కంపెనీ వ్యవస్థాపకుడు CEO కేశవ్ రెడ్డి అన్నారు. ఈ యాప్ తెలియని కాల్స్ కు సమాధానం ఇస్తుంది.…