West Indies beat India in 2nd T20I: టీ20ల్లో తాము ఎంత ప్రమాదకరమో వెస్టిండీస్ మరోసారి చూపించింది. గయానాలోని ప్రావిడెన్స్ మైదానంలో భారత్‌తో ఆదివారం రాత్రి జరిగిన రెండో టీ20లోనూ విండీస్ గెలిచింది. 152 పరుగుల లక్ష్య ఛేదనలో విండీస్ 8 వికెట్లు కోల్పోయి 18.5 ఓవర్లలో ఛేదించింది. విండీస్ హిట్టర్ నికోలస్ పూరన్ (67; 40 బంతుల్లో 6×4, 4×6) చెలరేగాడు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా (3/35), యుజ్వేంద్ర చహల్ (2/19) రాణించారు.…