తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం భారీ వర్షాలు కురిసే ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. పశ్చిమ, నైరుతి దిశ నుంచి రాష్ట్రం వైపు గాలులు వీస్తున్నాయని తెలిపింది. మంచిర్యాల, ములుగు, కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, సంగారెడ్డి, పెద్దపల్లి, హనుమకొండ, భద్రాద్రి కొత్తగూడెం, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు వున్నట్లు పేర్కొన్నారు. పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో వర్షాలు కురిసే…