హైదరాబాద్ లో కలుషిత నీరు కలకలం రేపుతోంది. గుట్టల బేగంపేటలో జలమండలి సరఫరా చేసే తాగునీరు కలుషితమై (water contamination) ఓ వ్యక్తి మృతి చెందగా.. 200 మందికి పైగా అస్వస్థతకు గురవడం ఆందోళన కలిగిస్తోంది. మరికొందరి పరిస్థితి విషమంగా వుంది. కొద్ది రోజులుగా తాగునీరు దుర్వాసన వస్తోందని వాటర్ వర్క్స్ సిబ్బందికి చెప్పినా పట్టించుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. మాదాపూర్ గుట్టలబేగంపేటలోని వడ్డెర బస్తీలో కలుషిత నీరు తాగి భీమయ్య (27) మృతిచెందగా.. రెండేళ్ల అతని కుమారుడు…