సీజన్ మొదలైన జూన్ 1వ తేదీ నుంచి జులై 12 వరకు ఉమ్మడి వరంగల్ పరిధిలోని నాలుగు జిల్లాల్లో ఏకంగా వంద శాతానికి పైగా వర్షపాతం నమోదైంది. అత్యధికంగా ములుగు జిల్లాలో 272.7 శాతం వర్షపాతం కురిసింది. ఇక భూపాలపల్లిలో 153, మహబూబాబాద్‌లో 147, జనగామలో 109, వరంగల్‌లో 95 , హనుమకొండలో 88 శాతం వర్షపాతం నమోదైనట్టు తేలింది. వరంగల్ నగరానికి వరద ముప్పు పొంచి ఉండటంతో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. ముందస్తు జాగ్రత్తగా ఎన్టీఆర్ఎఫ్ బలగాలు…
ఆంధ్రా ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టులో పనులు వేగంగా సాగుతున్నాయి. న్యూఢిల్లీ నుండి వచ్చిన కేంద్ర నిపుణుల బృందం శనివారం పోలవరం ప్రాజెక్టుని పరిశీలించింది. కేంద్ర జలశక్తి సంఘం సభ్యులు కె.వోహ్రా, సి.డబ్ల్యు.సి. సి.ఇ. ఎం.కె. సిన్హా, కృష్ణా గోదావరి రివర్ బోర్డు అధికారి డి. రంగారెడ్డి, సి.డబ్ల్యు.సి. సి.ఇ. ఆర్కే పచోరి, పి.పి.ఎ. మెంబర్ సెక్రటరీ ఎం.కె. శ్రీనివాస్, సీ.డబ్ల్యూ.సీ. డైరెక్టర్ సంజయ్ కుమార్, డిజైనింగ్ సి.ఇ. మొహమ్మద్ ఖయ్యుం , పి.పి.ఎ. సి.ఇ. ఏ.కే.…
ఇవాళ, రేపు కర్నూలు జిల్లాలో నీటి ప్రాజెక్టులను పరిశీలించనుంది 10 మంది కేఆర్ఎంబీ బృందం. కృష్ణానదీ ప్రాజెక్టుల స్వాధీనానికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ పై ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసిన నేపధ్యంలో జిల్లాలో పర్యటిస్తోంది కేఆర్ఎంబీ టీమ్. నేడు మల్యాల, ముచ్చుమర్రి, హంద్రీనీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకాలు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యు లేటర్ ను సందర్శించనుంది. రేపు శ్రీశైలం ప్రాజెక్టు, విద్యుత్ కేంద్రాలను పరిశీలించనుంది కేఆర్ఎంబీ టీమ్. అనంతరం శ్రీశైలంలో కేఆర్ఎంబీ టీం సమీక్ష…