కొమురం భీం జిల్లాలో దారుణం జరిగింది. కౌటాల పోలీస్టేషన్ లో గన్ మిస్ ఫైర్ కావడంతో.. డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. కొమురం భీం జిల్లా కౌటాల పోలీస్ స్టేషన్ లో అందరూ చూస్తుండగానే సెంట్రీ డ్యూటీ లో ఉన్న కానిస్టేబుల్ గన్ మిస్ ఫైర్ అయ్యింది.