గత కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా హడలెత్తించిన ఎండలు ఇప్పుడు కొద్దిగా శాంతించాయి. వేడి గాలులు తగ్గుమొఖం పట్టాయి. రెండు, మూడు రోజులుగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఆయా రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తగ్గాయి.
దేశంలోనే పలు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ (IMD) తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఆయా రాష్ట్రాల్లో భారీ వర్షపాతం (Heavy Rainfall) నమోదు అవుతుందని.. ఉరుములతో కూడిన వర్షాలు కురవచ్చని వార్నింగ్ (Warnings) ఇచ్చింది.