అది తొమ్మిది జిల్లాలకు హెడ్ ఆఫీస్. నిన్న మొన్నటి వరకు ఆ శాఖకు తప్ప మిగతా వాళ్లకు పెద్దగా తెలియదు కూడా. అలాంటిది ఇప్పుడు ఆధిపత్యపోరు మొదలైంది. దానికి రాజకీయ సెగ తగలడంతో ఒక్కటే చర్చ. ఇంతకీ ఆఫీస్ ఏంటి? ఎందుకు వివాదాస్పదంగా మారిందో ఈ స్టోరీలో చూద్దాం. ఇంటర్ విద్యలో 9 జిల్లాలకు వరంగల్ ఆర్వో ఆఫీస్ కేంద్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడే ఇంటర్‌బోర్డులో మూడు ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి తెలంగాణలోని వరంగల్‌లో…