కొమురం భీం జిల్లా పోలీసులతో పాటు ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లా పోలీసులను సైతం ఉన్నతాధికారులు రప్పించారు. విద్యార్ధిని ఇంటికి వెళ్లేందుకు ఎమ్మెల్యే కోవా లక్ష్మీ ఒక్క వాహనానికి మాత్రమే అనుమతి ఇచ్చారు. అలాగే, జిల్లాలో మీడియాపై సైతం పోలీసుల ఆంక్షలు విధించారు. విద్యార్ధిని శైలజ స్వగ్రామానికి వెళ్లకుండా 10 కిలో మీటర్ల దూరంలో మీడియాను ఆపేశారు పోలీసులు.