తెలుగు సినీ పరిశ్రమలో గత రెండు వారాలుగా కొనసాగుతున్న సినీ కార్మికుల సమ్మె సంచలనంగా మారింది. తమ వేతనాలను 30 శాతం పెంచాలని డిమాండ్ చేస్తూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ షూటింగ్‌లను నిలిపివేసి నిరసన తెలుపుతోంది. ఈ వివాదం తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్‌తో పాటు 72 మంది యాక్టివ్ నిర్మాతలు పాల్గొననున్నారు.…
Tollywood : సినీ కార్మికుల సమ్మె ఇంకా కొనసాగుతోంది. అటు నిర్మాతలు మొన్న చెప్పిన వేతనాల పెంపు విధానానికి కార్మికులు అస్సలు ఒప్పుకోవట్లేదు. మొత్తం 13 సంఘాలకు వేతనాలు 30 శాతం పెంచాల్సిందే అని పట్టుబడుతున్నారు. దీంతో నేడు రెండు రాష్ట్రాల సినిమాటోగ్రఫీ మంత్రులతో నేడు నిర్మాతలు భేటీ అయ్యారు. ఇటు తెలంగాణ సినిమాశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పలువురు నిర్మాతలు చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇరు వర్గాలు పట్టువిడుపుతో ఉండాలని సూచించారు.…
Tollywood : సినీ కార్మికుల వేతనాల పెంపుపై తాజాగా నిర్మాతల మండలి ఫిల్మ్ ఛాంబర్ తీసుకున్న నిర్ణయంపై ఫెడరేషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. రూ.2వేలు, అంతకంటే తక్కువ వేతనం ఉన్న వారికి మూడు విడతల్లో వేతనాలు పెంచుతామని ఫిలిం ఛాంబర్ కొద్దిసేపటి క్రితమే నిర్ణయించించింది. ఈ నిర్ణయంపై తాజాగా ఫెడరేషన్ సీరియస్ అయింది. ఈ నిర్ణయం ఫెడరేషన్ సభ్యులను విడదీసే విధంగా ఉందంటూ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ అన్నారు. రోజువారీ వేతనాలు తీసుకునే 13 సంఘాలకు వేతనాలు…