ఏ పదవులు చేజారి పరువు పోగొట్టుకున్నారో.. ఇప్పుడు అవే పదవులను పట్టేసి పట్టు నిలుపుకొన్నారట ఆ ఎమ్మెల్యే. హైకమాండ్ కూడా ఎందుకొచ్చిన గొడవ అనుకుందో లేక ఎమ్మెల్యేకే ప్రయారిటీ ఇవ్వాలనుకుందో.. మొదట్లో జరిగిన పొరపాటు పునరావృతం కాకుండా చేసింది. ఆలస్యంగానైనా పైచెయ్యి సాధించానని చెప్పుకొంటూ సదరు ఎమ్మెల్యే, ఆయన వర్గం జబ్బలు చరుచుకుంటోందట. గెలిచిన కొత్తలో సఖ్యతగా ఉండేవారు! పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి జిల్లాలోనే అత్యధిక ఓటర్లు కలిగిన నియోజకవర్గం. 2 లక్షల 50 వేల…