Voltas: ప్రముఖ వ్యాపార సంస్థ, ఉప్పు నుంచి విమానాల దాకా వ్యాపారం చేస్తున్న టాటా గ్రూప్ తన గృహోపకరణాల వ్యాపారాన్ని విక్రయిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. టాటా గ్రూప్ వోల్టాస్ హోమ్ అప్లియెన్సెస్ వ్యాపారాన్ని విక్రయించాలనుకుంటున్నట్లుగా బ్లూమ్‌బర్గ్ నివేదించింది. టాటా గ్రూపుకు వోల్టాస్‌లో 30 శాతం వాటా ఉంది. వోల్టాస్ పేరిట ఏసీలు, ఫ్రిడ్జ్‌ల వంటి హోం అప్లియెన్సెస్‌ని టాటా తయారు చేస్తోంది.