Volkswagen Tera: వోక్స్ వ్యాగన్ పోలో( Volkswagen Polo ) భారత మార్కెట్ నుంచి వెళ్లిపోయిన తర్వాత, ఆ స్థానాన్ని భర్తీ చేసేలా మరో కారును తీసుకురాలేదు. హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో పోలో ఒక ట్రెండ్ సెట్ చేసింది. ఫీచర్లు మాత్రమే కాదు, దాని స్టెబిలిటీ, రైడింగ్ ఫీల్ మరే కారులో కనిపించేది కాదని చెబితే అతిశయోక్తి కాదు. చాలా మంది కార్ ప్రేమికులకు ‘‘ఫోలో’’ ఒక భావోద్వేగం. యూరోపియన్ బిల్డ్ క్వాలిటీ అంటే ఏమిటో భారత్‌కు చూపించింది.