మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి అరెస్టైన విషయం తెలిసిందే. అనంతరం ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తాజాగా వివేకానంద డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం నేపథ్యంలో ఎర్ర గంగిరెడ్డి పేరు మరోసారి తెరపైకి వచ్చింది. దీంతో నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు కోరుతూ సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. సీబీఐ పిటిషన్ పై విచారణ చేసిన కడప కోర్టు.. బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణను…
మాజీ మంత్రి వివేకా హత్యకు ఉపయోగించిన ఆయుధాల కోసం రెండు ప్రాంతాల్లో మూడవ రోజు అన్వేషణ కొనసాగుతుంది. పులివెందులలోని రోటరీపురం వాగు, తూర్పు ఆంజనేయ స్వామి ఆలయ సమీపంలోని గరండాల వంకలో అన్వేషిస్తున్నారు . నిన్న వాచ్ మెన్ రంగన్న, ప్రకాష్ రెడ్డి, ఇనాయతుల్లా, వంట మనిషి లక్ష్మమ్మ కుమారుడు శివ ప్రకాష్ లను విచారించిన సీబీఐ అధికారులు.. అనంతరం మరో కోత్త ప్రాంతంలో ఆయుధాల కోసం అన్వేషణ ప్రారంభించారు. వ్యర్థాలను తొలగిస్తున్నారు ఇరవై మంది మున్సిపల్…