కరోనా మహమ్మారి ఇప్పటికే ఎంతోమంది సినీ ప్రముఖులను బలి తీసుకుంది. తాజాగా ప్రముఖ దర్శకనిర్మాత యు.విశ్వేశ్వరరావు కరోనాతో కన్నుమూశారు. ‘విశ్వశాంతి’ పతాకంపై విశ్వేశ్వరరావు నిర్మించిన పలు చిత్రాలు తెలుగువారిని విశేషంగా అలరించాయి. నిర్మాతగా, దర్శకునిగా, రచయితగా విశ్వేశ్వరరావు తనదైన బాణీ పలికించారు. ఆయన తెరకెక్కించిన చిత్రాలు దేశవిదేశాలలో ప్రదర్శితమయ్యాయి. ప్రభుత్వ అవార్డులనూ, ప్రేక్షకుల రివార్డులనూ పొందాయి. నేటికీ ఆ నాటి సినీజనం ‘విశ్వశాంతి’ విశ్వేశ్వరరావు అనే ఆయనను గుర్తు చేసుకుంటారు. తన చిత్రాలలో స్టార్స్ ను పక్కకు…