Viral Video : సంక్రాంతి పండుగకు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతిగా జరుపుకునే ఈ పంట పండుగను తమిళనాడులో పొంగల్‌గా 4 రోజుల పాటు జరుపుకుంటారు. పండుగ కోసం భారీ సన్నాహాల మధ్య, ఇక్కడ చెస్ ఛాంపియన్లు పొంగల్ వేడుకల సందర్భంగా డ్యాన్స్ చేసిన అందమైన వీడియో వైరల్ అవుతోంది. అవును, పొంగల్ వేడుకకు హాజరైన విశ్వనాథన్ ఆనంద్, డి. గుకేష్, ఆర్. ప్రజ్ఞానంద్.. ఇతర చెస్ ఛాంపియన్లందరూ పంచె ఉట్టు డ్యాన్స్ చేశారు.…
భారత చెస్ దిగ్గజం, ఫిడె ఉపాధ్యక్షుడు విశ్వనాథన్ ఆనంద్‌పై ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్‌సన్ తీవ్ర విమర్శలు చేశాడు. ఆనంద్ ఫిడె పదవిలో ఉండడానికి అనర్హుడని పేర్కొన్నాడు. గేమ్ నిబంధనలకు విరుద్ధంగా జీన్స్ వేసుకురావడం, మార్చుకోవాలి సూచించినా వినకపోవడంతో.. కార్ల్‌సన్‌ను ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్‌షిప్ నుంచి నిర్వాహకులు అర్ధంతరంగా తప్పించారు. అంతేకాదు జీన్స్ వేసుకున్నందుకు 200 అమెరికన్ డాలర్ల జరిమానా కూడా విధించారు. ర్యాపిడ్ టోర్నీ సమయంలో విశ్వనాథన్ ఆనంద్ వ్యవహరించిన తీరును మాగ్నస్ కార్ల్‌సన్ తప్పుబట్టాడు.…