స్టార్ హీరోయిన్ సాయి పల్లవి పై సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యింది. ఒక ఇంటర్వ్యూలో సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు తమ మనోభావాలను దెబ్బతీశాయంటూ భజరంగ్ దళ్ నాయకులు ఫిర్యాదులో పేర్కొన్నారు. వివరాల్లోకి వెళితే ప్రస్తుతం సాయి పల్లవి విరాటపర్వం చిత్రంలో నటిస్తోంది. రానా దగ్గుబాటి హీరోగా నటించిన ఈ చిత్రానికి వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్నాడు. పలు వాయిదాల తరువాత ఈ సినిమా జూన్ 17 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.…