డిజిటల్ ప్రపంచాన్ని ఒక్కసారిగా షేక్ చేసిన పరిణామం ఇది. భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ అకస్మాత్తుగా డీయాక్టివేట్ అయింది. దాంతో 274 మిలియన్ల (27 కోట్ల 40 లక్షలు) ఫాలోవర్స్ అయోమయంలో పడిపోయారు. శుక్రవారం (జనవరి 30) ఉదయం నుంచే కింగ్ ఇన్‌స్టా ప్రొఫైల్ పూర్తిగా మాయమైంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ‘Virat Kohli’ అని సెర్చ్ చేస్తే.. ప్రొఫైల్ కనిపించడం లేదు. ‘దిస్ పేజ్ ఈజ్ నాట్ అవైలబుల్’, ‘ది లింక్ మే బీ…
ప్రపంచ క్రికెట్ దిగ్గజం, భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఒక్కసారిగా ఖాళీగా కనిపించడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కేవలం కొన్ని గంటల క్రితమే అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా రికార్డు సృష్టించిన కోహ్లీ ఖాతా ఇలా మారిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నిజానికి నిన్న అనలిటిక్స్ సంస్థ HypeAuditor, జనవరి 2026 నెలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఇన్ఫ్లుయెన్స్ చేసే ఇన్‌స్టాగ్రామ్ వ్యక్తుల జాబితాను విడుదల చేసింది. ఇందులో 274.6…