టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ర్యాంకింగ్స్‌లో మూడు ఫార్మాట్‌లలో 900+ రేటింగ్ పాయింట్స్ సాధించిన మొదటి ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. ఇప్పటికే టెస్ట్, వన్డే క్రికెట్‌లో 900 ప్లస్ రేటింగ్ పాయింట్స్ అందుకున్న కింగ్.. తాజాగా టీ20 క్రికెట్‌లో కూడా 900+ రేటింగ్ పాయింట్స్ సాధించాడు. బుధవారం ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో విరాట్ 909 రేటింగ్ పాయింట్స్ సాధించాడు. 897 రేటింగ్ పాయింట్స్ నుంచి 909కి చేరుకున్నాడు.…