సాధారణంగా అర్థరాత్రి సమయంలో మహిళలు రోడ్లపై ప్రయాణించాలంటే భయపడిపోతుంటారు. ఎవరి తోడు లేకుండా ప్రయాణించాలంటే ఒకటికి వందసార్లు ఆలోచిస్తారు. అయితే అర్థరాత్రి బెంగుళూరులో ఆటోలో ప్రయాణించిన మహిళకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. బెంగుళూరులో ఓ మహిళ అర్థరాత్రి రాపిడో ఆటోలో ఒంటరిగా ప్రయాణించింది. దీంతో ఆమెకు ఎదురైన అనుభవం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ ఆటో డ్రైవర్ ప్రవర్తన తనకు పూర్తిస్థాయి భద్రతను కలిగించిందని ఆమె తెలిపింది.…