Annamalai: చెన్నై ఎయిర్‌పోర్టులో నటుడు-రాజకీయ నాయకుడు విజయ్, నటి త్రిష ఫోటోల వెనక రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఉందని, ఫోటోలను తీసి డీఎంకే ఐటీ టీమ్‌కి ఇచ్చిందని తమిళనాడు బీజేపీ చీఫ్ కే. అన్నామలై ఆరోపించారు. చెన్నై ఎయిర్ పోర్టులో విజయ్-త్రిషలు ప్రైవేట్ సెక్యూరిటీ చెక్ జరుగుతున్న సమయంలో వారి వీడియోను తీశారని అన్నామలై అన్నారు.