Candle Rally: విజయవాడలో కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనలో మరణించిన వారికి సంతాపంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించింది. స్వరాజ్య మైదానంలోని డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద చేపట్టిన ఈ ర్యాలీలో వైసీపీ నాయకులు, శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని, సరైన పరిహారం ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ మంత్రి…