దర్శకుడు కొరటాల శివ కమర్షియల్ వేలో స్ట్రాంగ్ సోషల్ మెసేజ్ ఇస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునేలా తన సినిమాలను రూపొందిస్తాడు. ప్రస్తుతం చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘ఆచార్య చిత్రంతో బిజీగా ఉన్నాడు. అయితే తాజాగా కొరటాల శివకు రౌడీ హీరో విజయ్ దేవరకొండ ‘నో’ చెప్పాడనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. విషయంలోకి వస్తే… డైరెక్టర్ కొరటాలకు యువసుధా ఆర్ట్స్ అధినేత సుధాకర్ మిక్కిలినేనితో మంచి అనుబంధం ఉంది. భవిష్యత్ లో కొరటాల శివ రూపొందించబోయే చిత్రాలను యువసుధ ఆర్ట్స్ నిర్మిస్తోంది. అయితే కొరటాల యువసుధ ఆర్ట్స్ బ్యానర్ కోసం కొత్త ప్రాజెక్టులను సెట్ చేయాలని చూస్తున్నారట. ఈ మేరకు యువసుధ ఆర్ట్స్, యువ దర్శకుడు వెంకి కుడుముల కాంబినేషన్లో ఓ ప్రాజెక్ట్ ను సెట్ చేశాడట. ఈ ప్రాజెక్ట్ కోసం విజయ్ దేవరకొండతో వెంకీ కుడుములకు మీటింగ్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నించాడట కొరటాల. కానీ విజయ్ దేవరకొండ ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేశాడట. కొరటాల శివ ఆఫర్ ను విజయ్ దేవరకొండ తిరస్కరించడానికి కారణం డేట్స్ ఇష్యూనేనట. రాబోయే రెండు సంవత్సరాలకు గానూ విజయ్ దేవరకొండ పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడట. దీంతో ఇప్పుడు కొత్త ప్రాజెక్టులకు సైన్ చేయడానికి సిద్ధంగా లేడట విజయ్. ఇప్పుడు విజయ్ ఈ ఆఫర్ ను తిరస్కరించడంతో కొరటాల శివ మరో హీరోతో సినిమా చేయాలని భావిస్తున్నాడట. ఈ మేరకు ఇప్పటికే కొంతమంది హీరోల పేర్లను షార్ట్ లిస్ట్ చేశారట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కోసం ఓ యంగ్ హీరోను సెలెక్ట్ చేయనున్నారట కొరటాల.