సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మూవీ ‘లైగర్’. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ‘లైగర్’కు పూరి, ఛార్మి, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీతో పాటు ఇతర ప్రధాన భారతీయభాషల్లోనూ విడుదల కానుంది. ఈ సినిమాలో ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ కోసం నిర్మాతలు ఏకంగా హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ యాండీ లాంగ్ టీమ్ ను రంగంలోకి దింపారు. ముంబైలోని ఓ భారీ సెట్ లో ఈ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ జరుగుతోంది. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆగిపోయింది. అయితే చాలా కాలం నుంచి మేకింగ్ దశలో ఉన్న ఈ చిత్రం నుంచి మేకర్స్ అప్డేట్స్ ఇవ్వక చాలా రోజులే అవుతోంది. అప్పుడెప్పుడో సినిమా నుంచి విజయ్ ఫస్ట్ లుక్ ను విడుదల చేసి భారీ అంచనాలు పెంచేసిన నిర్మాతలు మళ్ళీ ఇంత వరకూ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ ను విడుదల చేయలేదు. దీంతో విజయ్ దేవరకొండ అభిమానులు నిరాశకు గురవుతున్నారు. దీంతో విజయ్ దేవరకొండ అభిమానులు థ్రిల్ అయ్యేలా ‘లైగర్’ చిత్రం నుంచి ఏదైనా సరికొత్త అప్డేట్ ను విడుదల చేయాలని డైరెక్టర్ పూరి జగన్నాథ్ ను సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ చేస్తున్నారు. ‘లైగర్’ కోసం అవుతున్న సుదీర్ఘ ఆలస్యం విజయ్ భవిష్యత్ ప్రణాళికలపై పడే అవకాశం ఉంది. మరోవైపు పూరీ, కరణ్ జోహర్‌తో విడుదల తేదీని లాక్ చేస్తూ ప్రచార కంటెంట్‌ను రిలీజ్ చేయాలని యోచిస్తున్నారట. మరి విజయ్ దేవరకొండ అభిమానులను ఉత్సాహపరిచే అప్డేట్ ‘లైగర్’ నుంచి ఎప్పుడు వస్తుందో చూడాలి.