Mamta Kulkarni: బాలీవుడ్ మాజీ నటి, ప్రస్తుతం సన్యాసినిగా జీవిస్తున్న మమతా కులకర్ణి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల గోరఖ్‌పూర్ పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలతో మరోసారి వివాదం చెలరేగింది. తన మూడు రోజుల ఆధ్యాత్మిక పర్యటన సందర్భంగా విలేకరుల సమావేశంలో మమతా మాట్లాడుతూ.. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ముంబై పేలుళ్లకు పాల్పడలేదని, అతడు ఉగ్రవాది కాదన్నారు.