నిర్మాణ సంస్థ అంటే మాటలు చెప్పినంత ఈజీ కాదు. కోట్ల రూపాయల పెట్టుబడి కావాలి. సరైన కథలు ఎంపిక చేసుకోవాలి. సరైన స్టార్ కాస్టింగ్ వంటివి చూసుకోవాలి. అనుకున్న బడ్జెట్ లో సినిమాలు ఫినిష్ చేయాలి, లేదంటే వడ్డీలు అదనం. ఒక్కోసారి సినిమా ప్లాప్ అయితే కోట్ల రూపాయల డబ్బు వెనక్కి ఇవ్వాలి. ఇలా ఒకటి కాదు రెండు అనేక విషయాలు ప్రొడక్షన్ ముడిపడి ఉంటాయి. స్టార్ హీరోలు ముందు తమ వారిని ఉంచి పెట్టుబడులు పెడుతుంటరు.…