(మే 8న దర్శకనిర్మాత యస్.డి.లాల్ జయంతి)యాక్షన్ మూవీస్ తెరకెక్కించడంలో మేటి యస్.డి.లాల్. ఇక హిందీ చిత్రాలను తెలుగు చేయడంలోనూ దిట్టగా నిలిచారు లాల్. పలువురు దర్శకుల వద్ద అసోసియేట్ గా పనిచేసిన యస్.డి.లాల్, దర్శకునిగా పేరు సంపాదించిన తరువాత కూడా బి.విఠలాచార్య వద్ద కో-డైరెక్టర్ గా పనిచేశారు. ఏ రోజునా లాల్ భేషజాలకు తావీయలేదు. ఆయన సోదరుడు యస్.యస్.లాల్ తన కెమెరా పనితనంతో అలరించారు. ఈ ఇద్దరు సోదరులు చిత్రసీమలో తమదైన బాణీ పలికించారు. ‘సహస్ర శిరచ్ఛేద…