ఒక రోజు జరిగిన అనుకోని ఓ ఘటనతో 6 వ్యక్తుల జీవితాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతోన్న న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ ‘బా బా బ్లాక్ షీప్’. దోనేపూడి చక్రపాణి సమర్పణలో చిత్రాలయం స్టూడియోపై వేణు దోనేపూడి నిర్మిస్తున్న ఈ మూవీకి గుణి మంచికంటి దర్శకత్వం వహిస్తున్నారు. టిను ఆనంద్, ఉపేంద్ర, జార్జ్ మరియన్, అక్షయ్ , విష్ణు, కార్తికేయ, విస్మయశ్రీ, మాళవి, కశ్యప్, రాజారవీంద్ర తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.…