Baa Baa Black Sheep : ఆసక్తి రేపెలా ‘బా బా బ్లాక్ షీప్’ టీజర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక రోజు జరిగిన అనుకోని ఓ ఘటనతో 6 వ్యక్తుల జీవితాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతోన్న న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ ‘బా బా బ్లాక్ షీప్’. దోనేపూడి చక్రపాణి సమర్పణలో చిత్రాలయం స్టూడియోపై వేణు దోనేపూడి నిర్మిస్తున్న ఈ మూవీకి గుణి మంచికంటి దర్శకత్వం వహిస్తున్నారు. టిను ఆనంద్, ఉపేంద్ర, జార్జ్ మరియన్, అక్షయ్ , విష్ణు, కార్తికేయ, విస్మయశ్రీ, మాళవి, కశ్యప్, రాజారవీంద్ర తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శుక్రవారం ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ స్టార్ హీరో శర్వానంద్ విడుదల చేసి చిత్ర యూనిట్‌ను అభినందించారు.
Also Read :Prabhas: ప్రభాస్‌ను ‘టార్చర్’ పెడుతున్న సందీప్ వంగా ?
Also Read
- Rudravanam : తల లేని మృతదేహం.. గుండెలు జలదరించే మిస్టరీ: 'రుద్రవనం'లో దాగున్న ఆ భయంకరమైన రహస్యాలేంటి?
- Mouli: వీడేం చేయగలడు, బచ్చాగాడు అనుకున్నారు..పెద్ద ఫ్యామిలీ యాక్టర్ అయితే ఇలా చేసేవారా?
- Donga Naa Koduku Teaser: ఏంటి మౌళి.. పబ్లిక్‌గా టిఫిన్ చేసేస్తున్నావ్..! ‘దొంగ నా కొడుకు’ టీజర్ విడుదల..
- Jayaho Ramanuja: సంస్కృతంతో సహా ఆరు భాషల్లో 'జయహో రామానుజ'
టీజర్‌ను గమనిస్తే.. చుట్టూ పచ్చదనం, కొండలున్న అందమైన ఊరిని చూపిస్తారు. ‘చెప్పుకోడానికి ఇది మామూలు కథ కాదు. అండ పిండ బ్రహ్మాండాలను కూడా అల్లాడించే కథ’ అనే డైలాగ్ వినిపిస్తే , దానికి తగ్గట్లుగా ‘ఏం చెప్పాలనుకుంటున్నారో కాస్త క్లారిటీగా చెప్పవా’ అనే మరో డైలాగ్ వినిపిస్తుంది. ఈ గ్యాప్‌లో కొన్ని సీన్స్ కొంత మంది గన్స్‌తో కనిపిస్తారు. సినిమా ప్రధాన పాత్రధారుల్లో ఒకరైన అక్షయ్ ఈవెంట్లో చెఫ్ లుక్‌లో కనిపిస్తాడు. అప్పుడే మనకు మరో మెయిన్ క్యారెక్టర్ విష్ణు ఎంట్రీ కనిపిస్తుంది. విష్ణు దగ్గరకెళ్లి ఈవెనింగ్ మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేశా మామ అని అంటాడు.
Also Read :SKN : నాపై దుష్ప్రచారం చేస్తున్నారు.. సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేసిన SKN
గన్ ఫైరింగ్, కార్ చేజింగ్ వంటి ఎంగేజింగ్ సీన్స్ ను చూపిస్తారు. విష్ణు మాట్లాడుతూ ‘పోలీసులు మన వెంట ఎందుకొస్తున్నారా?..వాళ్లని కూడా ఇన్వైట్ చేశావా?’ అని టెన్షన్ పడుతుంటాడు. ఈ క్రమంలోనే జాన్ షెల్లీ హిట్లర్ అనే డాన్ పాత్రలో ఉపేంద్ర లిమాయే ఎంట్రీ ఉంటుంది. తను పెళ్లిలోకి వచ్చి అక్షయ్, విష్ణులను కొట్టి ‘మీరు దొబ్బేసిన బాక్స్ అండ్ గన్ ఎక్కడ.. నా దగ్గర కొట్టేసిన బాక్స్ ఎవరికి అమ్మేశారు?’ అని అడుగుతాడు. అక్కడ నుంచి టినూ ఆనంద్, జార్జ్ మరియన్, రాజా రవీంద్ర, విస్మయ శ్రీ తదితరులకు సంబంధించిన పాత్రలను పరిచయం చేశారు. టీజర్ చూస్తుంటే…డిఫరెంట్ కామెడీ, బ్యూటీఫుల్ లోకేషన్స్‌లో ‘బా బా బ్లాక్ షీప్’ చిత్రాన్ని రూపొందించారని టీజర్‌ను చూస్తుంటే అర్థమవుతుంది. మూవీ ఓ బాక్స్, గన్ చుట్టూ తిరిగుతుందని అర్థమవుతుంది. ఇంతకీ ఆ గన్ కోసం మాఫియా డాన్ ఎందుకు వెతుకుతుంటాడు. చివరకు ఆ బాక్స్ ఎవరి దగ్గర ఉంటుంది.. ఆ బాక్స్‌లో ఏముంటుందనే విషయాలు తెలుసుకోవాలంటే మాత్రం సినిమా చూడాల్సిందేనంటున్నారు నిర్మాత వేణు దోనేపూడి.
తాజావార్తలు
-
Saudi Arabia: ప్రేమకు మరణశిక్ష.. సౌదీ యువరాణి మిషాల్ విషాదగాథ
-
CM Chandrababu Naidu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసర ధరలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
-
CJP: షరతులు వర్తిస్తాయి.. తీహార్ జైలు నుంచి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదల.
-
AP Local Elections: సుప్రీం ఆదేశాలతో ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. అభ్యర్థుల తుది జాబితాకు బ్రేక్!
-
Traffic Jam: ముగిసిన దసరా సెలవులు.. హైదరాబాద్ బాట.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..!
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!