Venkatesh: వెంకటేష్.. ఈ పేరు వినగానే సంక్రాంతి, సూర్యవంశం, వసంతం, దృశ్యం ఇలాంటి సినిమాలు మైండ్ లో మెదులుతూ ఉంటాయి. ఎటువంటి విమర్శలు లేని, ఫ్యాన్స్ వార్స్ లేని.. అందరికి నచ్చిన ఏకైక హీరో వెంకటేష్.
భారతదేశానికి 41 ఏళ్ల తర్వాత ఒలంపిక్స్ లో హాకీలో పతకం రావడం పట్ల మన తారలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పతకం గెలిచి దేశ ప్రతిష్టను పెంచిన హాకీజట్టుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు నందమూరి బాలకృష్ణ. హాకీ జట్టు కఠోర శ్రమతోనే పతకం లభించింది. దేశ ప్రజల ఆశీస్సులు, మన్ననలు క్రీడా కారులకు ఎల్లవేళలా వుంటాయి. దేశం గర్వించేలా ఒలంపిక్స్ లో క్రీడాకారులు పోరాడుతున్నారు. ఒలంపిక్స్ లో ఇతర క్రీడాకారులు కూడా మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను…
విక్టరీ వెంకటేశ్ వెండితెరపై వినోదాన్నే కాదు, పగ ప్రతీకారాలనూ అద్భుతంగా ఆవిష్కరించగలడు. దానికి తాజా ఉదాహరణ ‘నారప్ప’. తన కొడుకును హతమార్చిన ఓ వర్గంపై నారప్ప అనే రైతు ఎలా పగ తీర్చుకున్నాడన్నదే ఈ చిత్ర కథ. అందులో కులం కూడా ఓ ప్రముఖ పాత్ర పోషించింది. వెట్రిమారన్ తెరకెక్కించిన తమిళ చిత్రం ‘అసురన్’కు ఇది రీమేక్. యంగ్ హీరో ధనుష్ పోషించిన పాత్రను వెంకటేశ్ రక్తి కట్టించగలడా అనే సందేహాన్ని కొందరు వ్యక్తం చేయకపోలేదు. దానికి…
వెంకటేశ్, వరుణ్‌తేజ్, తమన్నా, మెహ్రీన్ హీరోహీరోయిన్లుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మోర్ ఫన్ రైడర్ ‘ఎఫ్3’ షూటింగ్ రీస్టార్ట్ అయ్యింది. ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా భారీ వసూళ్లను సాధించిన ‘ఎఫ్2’ చిత్రానికి ఫ్రాంచైజీగా ‘ఎఫ్ 3’ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ఆగిన ఈ సినిమా షూటింగ్ పరిస్థితులు చక్కబడిన నేపథ్యంలో తిరిగి మొదలు…
విక్టరీ వెంకటేశ్, మీనా జంటగా తెరకెక్కుతున్న మూవీ ‘దృశ్యం2’. జీతూ జోసెఫ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సురేష్ బాబు దీనిని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి వెంకటేశ్ తన షూట్‌ను పూర్తి చేసుకున్నారు. కాగా ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయనున్నారనే వార్తలు విన్పిస్తున్నాయి. కరోనా కారణంగా మలయాళ చిత్రం ‘దృశ్యం2’ను ఓటీటీలోనే విడుదల అయ్యింది. అమెజాన్ ప్రైమ్ ‘దృశ్యం-2’ డైరెక్ట్ డిజిటల్ హక్కుల కోసం భారీ ఆఫర్‌తో ముందుకు…