దశాబ్దాల కలలు కన్న వెలిగొండ ప్రాజెక్టు సాకారం చేసుకున్నాం.. ప్రాజెక్టు ప్రారంభించే అవకాశాన్ని దేవుడు నాకివ్వటం అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు సీఎం వైఎస్ జగన్. వెలిగొండ ప్రాజెక్టును అప్పట్లో నాన్నగారు వైఎస్సార్ శంఖుస్థాపన చేసి పనులు మొదలు పెడితే.. ఇవాళ ఆయన కొడుకుగా రెండు టన్నెల్స్ ను ప్రారంభించటం దేవుడి రాసిన స్క్రిప్ట్ అని భావిస్తున్నాను అన్నారు..
దశాబ్దాల కల నెరవేరుస్తూ వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఈ రోజు ప్రకాశం జిల్లాలో పర్యటించిన ఆయన.. ట్విన్ కెనాల్స్ ప్రారంభోత్సవ పైలాన్ ను ఆవిష్కరించారు. వెలిగొండ ప్రాజెక్టు ఫోటో గ్యాలరీని సందర్శించారు. వ్యూ పాయింట్ నుంచి ప్రాజెక్టును పరిశీలించి.. జరగాల్సిన పనులపై ఆరా తీశారు సీఎం వైఎస్ జగన్.