వికారాబాద్ జిల్లా తాండూరు డిపోలో శ్రామిక్‌గా పనిచేస్తోన్న టి.రాజప్ప ఆత్మహత్యపై వస్తోన్న వార్తలు పూర్తి అవాస్తవమని టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. ఆయన ఎక్స్ వేదికగా.. ‘ఆర్టీసీ అధికారులు వేధించడం వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నారనడంలో ఏమాత్రం నిజం లేదు. ఈ నిరాధారమైన వార్తలను టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ఖండిస్తోంది. 2013లో డ్రైవర్‌గా ఆర్టీసీలో చేరిన రాజప్ప.. ఆరోగ్య సమస్యల కారణంగా అన్‌ఫిట్ అయ్యారు. 2018 నుంచి శ్రామిక్ గా డిపోలో పనిచేస్తున్నారు. గత నెలలో అధికారులకు…