ఏపీలో మహిళలపై జరుగుతున్న అరాచకాలకు వ్యతిరేకంగా ఈనెల 27న బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని టీడీపీ నేత బోండా ఉమ చెప్పారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రి వద్ద ఇటీవల మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ నానాయాగీ చేశారని.. చంద్రబాబు వస్తున్నారని తెలిసి మేకప్ వేసుకుని వచ్చారని బోండా ఉమ ఎద్దేవా చేశారు. మహిళా కమిషన్‌కు లేని పవర్స్‌ను కూడా ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు. పెన్ను, పేపర్ ఉందని నోటీసులు ఇచ్చి.. ఎలా రారో చూస్తామంటూ ఛాలెంజ్‌లు చేస్తున్నారని…